కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలంటూ... ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవితకు వినతిపత్రం అందజేశారు. మొత్తం మహిళలతో నడుస్తున్న ఏకైక వ్యవస్థ కేజీబీవీలో పనిచేస్తున్న సిబ్బంది శ్రమ దోపిడికి గురవుతున్నారని... యూనియన్ జిల్లా ఇంఛార్జ్ ఎం. సుధాకర్ ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 475 కేజీబీవీల్లో... అవసరాల మేరకు సిబ్బంది లేకపోవడం వల్ల నాన్ టీచింగ్, వర్కర్స్ అధిక పనిభారంతో అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.
జీతాల పెంపు, రైగ్యులరైజేషన్, ఖాళీల భర్తీ చేయాలని విజ్ఞప్తి చేయగా... ఎమ్మెల్సీ కవిత సానుకూలంగా స్పందించినట్టు వెల్లడించారు. అన్ని వివరాలతో వారం రోజుల్లో హైదరాబాద్‌లో తనను కలవాలని, కచ్చితంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు ఈశ్వరి, సుమలత, హేమలత పాల్గొన్నారు.
ఇదీ చూడండి: వీధి వ్యాపారులు అభివృద్ధి చెందాలి : హరీశ్‌రావు