నిజామాబాద్ నగరంలోని జిల్లా వైద్యాధికారి కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. తమకు ఇవ్వాల్సిన బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. కొవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతున్నా.. తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పనిచేశామని ఆశా వర్కర్లు తెలిపారు. కరోనా సోకిన ఆశా వర్కర్ల కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేయాలని వారు కోరుతున్నారు.
ఆశా కార్యకర్తలకు కరోనా డ్యూటీ ప్రత్యేక అలవెన్సు కింద రూ. 10 వేలు ఇవ్వాలని.. సచివాలయాలకు వీరిని అనుసంధానం చేయాలంటూ సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన డిమాండ్ చేశారు. కొవిడ్ వల్ల మరణించిన ఆశాలకు రూ. 50 లక్షల బీమా ఇవ్వాలని.. వారి కుటుంబంలో ఒకరికి ఆశా ఉద్యోగమివ్వాలని కోరారు.
ఇవీచూడండి: ఈఎస్ఐ కేసు: దేవికారాణితోపాటు మరో ఎనిమిది మంది అరెస్ట్