పసుపు పంటకు క్రమంగా ధర పెరుగుతోంది. సీజన్ ప్రారంభంతో పోలిస్తే ధర కాస్త మెరుగైంది. అయినా... ఇప్పటికీ క్వింటా ధర రూ.7వేలు దాటడం లేదు. నిన్న గరిష్ఠ ధర రూ.10 వేలు దాటగా... సరాసరి మాత్రం రూ.7 వేల లోపే పలుకుతోంది. నాలుగేళ్ల తర్వాత గరిష్ఠ ధర రూ.10 వేలు దాటడం వల్ల నిజామాబాద్ మార్కెట్ యార్డు పసుపు రైతుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకరిద్దరికి మాత్రమే గరిష్ఠ ధర లభిస్తుందని... అందరికీ ఆ ధర లభిస్తేనే గిట్టుబాటైనట్టని రైతులు చెబుతున్నారు. అసలు మార్కెట్లో ఎంత ధర ఉంది...? గరిష్ఠ ధరపై రైతులు ఏమంటున్నారు...? మార్కెట్లో పసుపు ధరలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీశైలం అందిస్తారు.
పసుపు పంటకు పెరుగుతోన్న ధర... రైతులు సంతోషమేనా? - నిజామాబాద్ పసుపు యార్డు
పసుపు రైతుల్లో కాస్త సంతోషపు ఛాయలు కన్పిస్తున్నాయి. క్రమంగా పసుపు పంటకు పెరుగుతున్న ధరలే ఆ ఆనందానికి కారణం కాగా... అది కొంతమందికే పరిమితమవుతోందని రైతులు వాపోతున్నారు. గరిష్ఠ ధర రూ.10 వేలు దాటుతోన్నా... సరాసరి మాత్రం 7 వేలలోపే పలుకుతోందంటున్నారు.
పసుపు పంటకు క్రమంగా ధర పెరుగుతోంది. సీజన్ ప్రారంభంతో పోలిస్తే ధర కాస్త మెరుగైంది. అయినా... ఇప్పటికీ క్వింటా ధర రూ.7వేలు దాటడం లేదు. నిన్న గరిష్ఠ ధర రూ.10 వేలు దాటగా... సరాసరి మాత్రం రూ.7 వేల లోపే పలుకుతోంది. నాలుగేళ్ల తర్వాత గరిష్ఠ ధర రూ.10 వేలు దాటడం వల్ల నిజామాబాద్ మార్కెట్ యార్డు పసుపు రైతుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకరిద్దరికి మాత్రమే గరిష్ఠ ధర లభిస్తుందని... అందరికీ ఆ ధర లభిస్తేనే గిట్టుబాటైనట్టని రైతులు చెబుతున్నారు. అసలు మార్కెట్లో ఎంత ధర ఉంది...? గరిష్ఠ ధరపై రైతులు ఏమంటున్నారు...? మార్కెట్లో పసుపు ధరలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీశైలం అందిస్తారు.
ఇదీ చూడండి: ట్రాక్టర్ డ్రైవర్‌కు హెల్మెట్ లేదని జరిమానా