ఉగ్రవాదులు దాడి చేసినట్లైతే ఏ విధంగా వ్యవహరించాలి, తీవ్రవాదులను ఎలా హతమార్చాలనే దానిపై మాక్ డ్రిల్ నిర్వహించారు.
బాసర ఆలయంలో ఆక్టోపస్ - ఆలయం
ఆక్టోపస్ కమాండోలు బాసర ఆలయాన్ని చుట్టుముట్టాయి. తీవ్రవాదుల భరతం పట్టారు. అయితే ఇదంతా నిజం కాదు. విపత్కర పరిస్థితుల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంలో భాగంగా ఇవాళ మాక్ డ్రిల్ నిర్వహించారు.
రిహార్సల్ చేస్తున్న కమాండోలు
బాసర ఆలయ భద్రతపై అధికారులు దృష్టిపెట్టారు. ముష్కరుల నుంచి జ్ఞాన సరస్వతీ దేవి ఆలయాన్ని, భక్తులను ఎలా రక్షించాలో ఆక్టోపస్ కమాండోలు, పోలీసులు సంయుక్తంగా రిహార్సల్ చేసి చూపించారు.
ఉగ్రవాదులు దాడి చేసినట్లైతే ఏ విధంగా వ్యవహరించాలి, తీవ్రవాదులను ఎలా హతమార్చాలనే దానిపై మాక్ డ్రిల్ నిర్వహించారు.
sample description