దేశంలో పంటల బీమా లేని ఏకైక రాష్ట్రం... తెలంగాణ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ శంకర్‌నాయక్‌తోపాటు కాంగ్రెస్ శ్రేణులతో కలెక్టరేట్‌కు వెళ్లి రైతుల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చారు.
గత నెలలో కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల ఎకరాల్లో పంటలు కోల్పోయినా... పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సన్నాలు సాగు చేయాలని ముఖ్యమంత్రి చెప్పడం వల్లే పెద్దఎత్తున పంటలు వేశారన్న ఉత్తమ్... సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే మద్దతు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు.