ETV Bharat / city

సాగర్​కు పోటెత్తిన పర్యాటకులు

నాగార్జునసాగర్​ జలసవ్వళ్లను వీక్షించేందుకు పర్యాటకులు పోటెత్తారు.  టూరిస్టుల రాకతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

సాగర్​కు పోటెత్తిన పర్యాటకులు
author img

By

Published : Aug 18, 2019, 1:26 PM IST

సాగర్​కు పోటెత్తిన పర్యాటకులు

నాగార్జునసాగర్​ నుంచి జాలువారుతున్న జలధారలను వీక్షించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. సందర్శకుల రద్దీతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సాగర్‌ పిల్లర్‌ పార్కు నుంచి బస్టాండు వరకు వాహనాలు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాయి. పోలీసులు సాగర్‌ బైపాస్‌ నుంచి వన్‌వే ద్వారా వాహనాలను దారి మళ్లిస్తున్నారు. భద్రత దృష్ట్యా ప్రధాన జలాశయం పైకి సందర్శకులకు అనుమతి నిరాకరించారు. పర్యాటకులు పాత వంతెనపైకి వెళ్లి ఫోటోలు దిగకుండా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.