యాదాద్రి ప్రధానాలయంలో సంప్రదాయ హంగులతో కూడిన విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయి. విద్యుత్ వెలుగులు జిగేల్ మనిపించేలా లైటింగ్ ఏర్పాట్లను యాడా చేపట్టింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన లైటింగ్ టెక్నాలజీ సంస్థతో పనులను నిర్వహిస్తోంది.
![The Yadadri temple is undergoing traditional electrification works speedly](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-81-28-yadadri-spl-vidhyuth-kanthulu-av-ts10134_28012021080953_2801f_1611801593_205.jpg)
ప్రధాన ఆలయంలో ముఖమండపం, క్షేత్ర పాలకుని సన్నిధి, ముఖ మండపం పైకప్పుతో పాటు ప్రథమ మాడ వీధిలోనూ లైటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమారు రూ.8 నుంచి రూ.10 కోట్ల వ్యయంతో సరికొత్త విద్యుద్ధీకరణ పనులు చేపట్టారు. సీలింగ్ లైటింగ్‌లలో షాండిలియర్ ఆకర్షణీయంగా ఏర్పాటుచేశారు.
![The Yadadri temple is undergoing traditional electrification works speedly](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-81-28-yadadri-spl-vidhyuth-kanthulu-av-ts10134_28012021080953_2801f_1611801593_338.jpg)
వీటితో పాటు ఆలయ మాడవీధుల్లో అత్యాధునిక విద్యుత్ దీపాల ఏర్పాట్లకు రంగం సిద్ధమైంది. మరోపక్క యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధిలో భాగంగా భక్తులకు వసతుల ఏర్పాట్లను యాడా చేపట్టింది. రూ.9 కోట్ల వ్యయంతో గండిచెర్ల చెంత దీక్షాపరుల మండపం, దీక్షా భక్తులు బస చేసేందుకు సముదాయాన్ని నిర్మిస్తోంది.
![The Yadadri temple is undergoing traditional electrification works speedly](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-81-28-yadadri-spl-vidhyuth-kanthulu-av-ts10134_28012021080953_2801f_1611801593_708.jpg)
దాదాపు 300 మంది బసచేసి తమ దీక్షను కొనసాగించేందుకు వీలుగా ఈ సముదాయంలో ఏర్పాట్లను కల్పిస్తున్నట్లు యాడా వెల్లడించింది.
ఇవీ చూడండి: ఈ బుద్ధుడి గురించి మీకు తెలుసా?