sunrays touching shiva lingam: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో శ్రీ ఇష్ట కామేశ్వరి శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి దేవస్థానంలో శివలింగంపై తెల్లవారుజామున సూర్య కిరణాలు ప్రసరించాయి. మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం సప్తమి నుంచి శివరాత్రి పర్వదినం వరకు సూర్యకిరణాలు శివలింగంపై విరాజిల్లుతాయని ఆలయ పూజారులు వెల్లడించారు.

కిరణాలు పడుతున్న సమయంలో దర్శించుకుంటే...
ఈ కిరణాలు శివలింగంపై పడుతున్న సమయంలో స్వామివారిని దర్శించుకుంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, ఆరోగ్యం మెరుగుపడుతుందని, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని ఆలయ పండితులు తెలిపారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా సూర్యకిరణాలు శివలింగంపై ప్రసరించడం ఆనవాయితీగా వస్తుందని పూజారులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు ధనుంజయ శర్మ, విష్ణువర్ధన్ శర్మ, ఈవో కొండారెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:TTD SARVADARSHNAM: శ్రీవారి సర్వదర్శన భక్తులకు శుభవార్త..