ETV Bharat / city

'మందు పోయకుండా ఓటు అడుగుతామని నరసింహస్వామి మీద ప్రమాణం చేయండి' - కేసీఆర్ పై రేవంత్ ఫైర్

Revanth Reddy Latest Comments: ఆడబిడ్డను గెలిపించండంటూ.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మందు పోయకుండా ఓటు అడుగుతామని యాదాద్రి నరసింహస్వామి మీద ప్రమాణం చేయండని భాజపా, తెరాసలకు సవాల్ విసిరారు. గడ్డి మేసే గాడిదలకు కాదు.. సమస్యలపై కొట్లాడేవారికి ఓటు వేయండన్న రేవంత్​రెడ్డి.. మీ ఆడబిడ్డకు ఒక్క అవకాశమివ్వండని కోరారు. పలువురికి కాంగ్రెస్‌ జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Revanthreddy
Revanthreddy
author img

By

Published : Oct 18, 2022, 10:58 PM IST

Revanth Reddy Latest Comments: మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి.. భాజపా, తెరాసలపై విమర్శలు గుప్పించారు. మందు పోయకుండా ఓటు అడుగుతామని యాదాద్రి నరసింహ స్వామి మీద ప్రమాణం చేయండని ఇరు పార్టీలకు సవాల్ విసిరారు. మీ భవిష్యత్తును మద్యానికి, డబ్బులకు తాకట్టు పెట్టకండని అక్కడి ప్రజలకు సూచించారు. ఓటు వేసే ముందు మునుగోడు ప్రజలు ఒకసారి ఆలోచించాలని అన్నారు. మంగళవారం చౌటుప్పల్ మండల పరిధిలోని తంగేడుపల్లి, లక్కారం, మల్కాపురం గ్రామాలలో నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కొంపల్లిలో పలువురిని కాంగ్రెస్‌ జెండా కప్పి పార్టీలోకి రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు.

మునుగోడు ఆడబిడ్డలు ఒకసారి ఆలోచించండి.. ఎనిమిదేళ్లుగా సీఎం కేసీఆర్ ఇక్కడి ప్రజలను మోసం చేశారని రేవంత్​రెడ్డి ధ్వజమెత్తారు. మునుగోడు నియోజక వర్గంలో గల్లీ గల్లీలో మందు వరదలై పారుతుందన్న ఆయన.. ఎన్నికల కోసం తెరాస, భాజపాలు స్కూల్ పిల్లలనూ తాగుబోతులను చేస్తున్నాయని ఆరోపించారు. ఈ విషయాన్ని మునుగోడు ఆడబిడ్డలు ఒకసారి ఆలోచించాలన్నారు. రాష్ట్ర భవిష్యత్తును మలుపు తిప్పే అవకాశం మునుగోడు ప్రజలకు వచ్చిందన్న రేవంత్​రెడ్డి.. మీ ఆడబిడ్డను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ గెలుపు దళిత, గిరిజన, బలహీన వర్గాలు, మహిళలు, యువకులకు ఎంతో అవసరం అని వ్యాఖ్యానించారు.

మీ ఆడబిడ్డకు ఒక్క అవకాశమివ్వండి.. బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ తాగుబోతుల తెలంగాణగా మార్చాడని రేవంత్​రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే నాటికి లిక్కర్‌తో రాష్ట్రానికి వచ్చే ఆదాయం రూ.10వేల కోట్లు ఉండేది.. కానీ ఎనిమిదేళ్లలో రూ.36వేల కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఇది మా ఆడబిడ్డల రెక్కల కష్టం కాదా అని ప్రశ్నించారు. అమరుల త్యాగాలు ఇలాంటి తెలంగాణ కోసమేనా అన్న రేవంత్.. పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకుంది ఇందుకేనా అనేది మునుగోడు ఆడబిడ్డలు ఒకసారి ఆలోచన చేయాలని సూచించారు. ఆడబిడ్డలు కొంగు బిగిస్తే ఎవరైనా పరారే.. మహిళా శక్తి ముందు ఏదైనా దిగదుడుపే.. మీపై నమ్మకంతో మునుగోడులో కాంగ్రెస్​ను గెలిపిస్తామని సోనియా, రాహుల్​కు తాను మాటిచ్చానని అన్నారు. గడ్డి మేసె గాడిదలకు కాదు.. సమస్యలపై కొట్లాడేవారికి ఓటు వేయండన్న రేవంత్​రెడ్డి.. మీ ఆడబిడ్డకు ఒక్క అవకాశమివ్వండని వ్యాఖ్యానించారు.

అప్పటి గవర్నర్ నరసింహన్​ను అడగండి.. రాజగోపాల్ రెడ్డికి ధైర్యముంటే ఆడబిడ్డ సవాల్‌ను స్వీకరించాలన్న రేవంత్​రెడ్డి.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏ రోజూ భాజపా, తెరాస మునుగోడుకు రాలేదని దుయ్యబట్టారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని గుజరాత్ నేతలకు తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. ఒక్క ఆడబిడ్డను ఓడించేందుకు దిల్లీ నుంచి మోదీ, అమిత్ షా వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నేతన్నలపై జీఎస్టీ భారం వేసిన మోదీకి మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. అప్పటి గవర్నర్ నరసింహన్​ను అడగండి రేవంత్.. తెలంగాణ కోసం కొట్లాడిండో లేదో చెబుతారన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.