నల్గొండ జిల్లా మిర్యాలగూడలో హనుమాన్‌పేట ఫ్లైఓవర్ వద్ద అతిథి లాడ్జిలో జ్యోతి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే భాస్కరరావు కరోనా పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించారు. మిర్యాలగూడలో కరోనా కేసులు పెరుగుతన్న నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా చికిత్స చేయడానికి జ్యోతి ఆసుపత్రి యాజమాన్యానికి ప్రభుత్వం నుంచి అనుమతులు రాగా కొవిడ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో కరోనా లక్షణాలు ఉన్న వారందరికీ పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నామని.. ప్రైవేటు ఆసుపత్రులలోనూ చికిత్స పొందేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు ఎమ్మెల్యే భాస్కరరావు తెలిపారు. పట్టణ ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారమే వైద్యం అందించాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరారు. కరోనా వైరస్‌కు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కొవిడ్‌ను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: వ్యాక్సిన్ ట్రయల్స్ ఆలస్యంపై ట్రంప్ మండిపాటు