ప్రణయ్ హత్య కేసు విచారణ... ఈ నెల 23కు వాయిదా పడింది. కేసును వాయిదా వేస్తూ నల్గొండలోని ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసు ప్రధాన నిందితుడైన ఏ1 మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలియజేశారు.
సోదరుడి చితికి నిప్పంటించినందున.. హిందూ సంప్రదాయం ప్రకారం బయటకు వచ్చే అవకాశం లేదు కాబట్టి మారుతీరావు తమ్ముడు శ్రవణ్ విచారణకు హాజరయ్యే అవకాశం లేదని తెలిపారు. శ్రవణ్‌కు మినహాయింపునివ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సీఆర్పీసీ 317 సెక్షన్ ప్రకారం.. శ్రవణ్‌కు ఈ విడతకు కోర్టు హాజరు నుంచి ఉపశమనం లభించింది. వీటన్నింటి దృష్ట్యా న్యాయస్థానం కేసును ఈ నెల 23కు వాయిదా వేసింది.
ఇవీ చూడండి: కనుమరుగైపోతున్న కళకు జీవం పోస్తున్నారు