నల్గొండ జిల్లాలోని వాడపల్లి సరిహద్దు నుంచి ఏపీలోకి వెళ్లేందుకు... రాత్రి ఏడు గంటల వరకే అనుమతిస్తున్నామని జిల్లా ఎస్పీ ప్రకటించారు. వాడపల్లి మీదుగా ప్రయాణించే వాహనాలు... ఇకపై ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు గంటల వరకు మాత్రమే రావాలని సూచించారు. పొరుగు రాష్ట్రం తీసుకున్న నిర్ణయం వల్ల... నిర్దేశిత సమయాన్ని ప్రకటిస్తున్నట్లు ఎస్పీ తెలియజేశారు.
రాత్రి ఏడుగంటల తర్వాత తర్వాత తమ భూభాగంలోకి వచ్చే వాహనాలను నిలిపివేస్తామని గుంటూరు ఎస్పీ స్పష్టం చేశారని... అందుకనుగుణంగానే వాడపల్లి సరిహద్దు నుంచి రాకపోకలు సాగాలని ఆదేశించారు. అయితే సరకు రవాణా, అత్యవసర సేవల వాహనాలు మినహా... మిగిలిన వారంతా విధిగా పాసులు కలిగి ఉండాలని పేర్కొన్నారు. అటు నాగార్జునసాగర్-మాచర్ల దారిని ఇంటిగ్రేటెడ్ రహదారిగా ఏపీ సర్కారు గుర్తించనందున... ఆ మార్గంలో ఎలాంటి రాకపోకలు ఉండబోవని ప్రకటించారు.