మర్డర్ సినిమా చిత్రీకరణను ఆపాలంటూ నల్గొండ జిల్లా కోర్టులో... అమృత వేసిన దావాకు అనుగుణంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కోర్టు అత్యవసర నోటీసులను జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 6న వాయిదా వేసింది. మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీని ఆధారంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మర్డర్ పేరిట సినిమా తీస్తున్నారు.
కేసు విచారణ దశలో ఉన్నందున... కల్పితాలతో సినిమా విడుదల అయితే సాక్షులపై ప్రభావం పడే అవకాశం ఉందని అమృతి కోర్టుకు విన్నవించింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది. విచారించిన ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి... రాంగోపాల్ వర్మ, నట్టి కుమార్కు అత్యవసర నోటీసులు జారీ చేసింది. మధ్యంతర పిటిషన్ తదుపరి విచారణను ఈ నెల 6కు వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రతివాదులకు ఈ-మెయిల్, వాట్సప్ ద్వారా నోటీసులు జారీ చేసినట్టు న్యాయవాది తెలిపారు.
ఇవీచూడండి: కరోనా లక్షణాలు లేకుండా రాపిడ్ కిట్లతో పరీక్షలు చేయించుకోవద్దు: ఈటల