ETV Bharat / city

ETV BHARAT EXCLUSIVE: "రాజకీయ అరంగేట్రాలకు అడ్డా.. ఉమ్మడి నల్గొండ గడ్డ"

ఎవరు పార్టీ స్థాపించాలన్నా... ఎవరు రాజకీయ అరంగేట్రం చేయాలన్నా... ఎవరు ఆధిపత్యం ప్రదర్శించుకోవాలన్నా ముందుగా గుర్తుకొచ్చేది ఉమ్మడి నల్గొండ జిల్లా. సాయుధ పోరాటాలే కాదు.. రాజకీయ యవనికలోనూ విజయ బావుటా ఎగురవేయాలని తహతహలాడే నాయకులకు కేంద్ర బిందువది. అందుకే ఇప్పుడందరూ ఆ జిల్లా వైపు చూస్తున్నారు.

author img

By

Published : Aug 24, 2021, 9:55 AM IST

nalgonda politics
nalgonda politics

సాయుధ పోరాటం... నిజాం నవాబులపై ధిక్కార ధోరణి... స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖంగా వెలుగొందిన చరిత్ర... ఇదీ ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయ చిత్రపటం. రాజకీయ దురంధరులుగా భావించే నేతల్లో ఎక్కువ మంది ఈ ప్రాంతం నుంచి వచ్చినవారే ఉన్నారు. ఆధిపత్య పోరులో అందెవేసినచేయిగా వ్యవహరించే నల్గొండ జిల్లా నేతలు... రాజకీయాల్లో వినూత్న ఒరవడిని తీసుకొచ్చారు. అయితే జిల్లాపై ప్రస్తుతం కొత్తవారి చూపు పడింది. పార్టీ స్థాపించాలనుకునేవారు... రాజకీయ అరంగేట్రం చేయాలని భావించేవారు... అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు ఇంకొందరు... ఇలా అందరి చూపు ఉమ్మడి నల్గొండ వైపే ఉంటోంది.

అన్ని పార్టీలకు అందలం...

రాజకీయాల్లో రాణించాలనుకునేవారు నల్లగొండ వైపు దృష్టిసారించడానికి ప్రధాన కారణం... అక్కడ నెలకొన్న భిన్న పరిస్థితులే. ప్రజల్లో చైతన్యం కనిపించడం... ఆది నుంచీ విప్లవ భావాలు నెలకొన్న దృష్ట్యా... నల్గొండ రాజకీయ పరిస్థితులు విభిన్న రీతిలో ఉంటుంటాయి. కమ్యూనిస్టులకు కంచుకోటగా భావించిన జిల్లా క్రమంగా... కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చేరువైంది. ప్రస్తుతం తెరాసకు పట్టం కట్టింది. రావి నారాయణరెడ్డి తరం నుంచి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తరం వరకు వివిధ దశల్లో... ఉమ్మడి రాష్ట్ర రాజకీయ యవనికపై నల్గొండ జిల్లా నేతలు ప్రత్యేక ముద్ర వేశారు. ప్రస్తుత తరంలోనూ పలువురు నేతలు తమ తమ పార్టీల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్, తెదేపా, తెరాస ఇలా... అన్ని పార్టీలకు సముచిత ఆదరణ దక్కింది. మారుతున్న కాలానికి అనుగుణంగా రాజకీయాల్లోనూ మార్పులకు స్వాగతం పలుకుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకునే... నేతలు ఉమ్మడి నల్గొండ జిల్లాపై దృష్టిసారిస్తున్నట్లు కనపడుతోంది. తాజాగా ఈ కోవలోకే చేరుతున్నట్లు కనపడుతోంది... వైఎస్ షర్మిల, ఆర్​ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీల తీరు.

ఇప్పటికే జిల్లాలపై చూపు...

షర్మిల ఇప్పటికే రెండుసార్లు నల్గొండ జిల్లాలో పర్యటించారు. ఉద్యోగ ప్రకటనలు లేక ఆత్మహత్యలకు పాల్పడ్డ కుటుంబాలను పరామర్శించేందుకు ఒకసారి, నిరుద్యోగ దీక్ష కోసం మరోసారి పర్యటనలు చేపట్టారు. జూన్ 16న మిర్యాలగూడ మండలం బంగారుగడ్డ... నేరేడుచర్ల మండలం మేడారం సందర్శించారు. నిరుద్యోగుల కోసం నిరాహారదీక్షను... జులై 27న చండూరు మండలం పుల్లెంల గ్రామంలో చేశారు. పార్టీ స్థాపనకు ముందు నుంచే... ఉమ్మడి నల్గొండ జిల్లాపై షర్మిల ప్రత్యేక దృష్టిసారించారు. తన తండ్రి హయాంలో ఈ జిల్లా నుంచే పలువురు కీలకంగా వ్యవహరించడం... ఇప్పటికీ కేడర్ బాగానే ఉందన్న భరోసాతో మూడు జిల్లాల నేతలతో సంప్రదింపులు జరిపారు. వైఎస్ వల్ల లబ్ధి పొందిన కొందరు నేతలు... ఇప్పుడు షర్మిలకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఇక స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ సైతం... నల్గొండ నుంచే రాజకీయ అరంగేంట్రం చేశారు. ఈ నెల 8న నిర్వహించిన బీఎస్పీ సభ ద్వారా ఆయన ఆ పార్టీలో చేరారు.

కోదండరామ్, మల్లన్న సైతం...

మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 71 మంది అభ్యర్థులు పోటీ చేశారు. దీన్నిబట్టే తెలుస్తుంది... నల్గొండ జిల్లాలో రాజకీయ చైతన్యం ఎలా ఉందో. ఆ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డితోపాటు కోదండరామ్, తీన్మార్ మల్లన్న పోటీకి దిగారు. ఈ ముక్కోణపు పోరులో తుది వరకు ఉత్కంఠ నెలకొనగా... అనూహ్యంగా మల్లన్న రెండో స్థానంలో నిలిచారు. పల్లా, కోదండరామ్ మధ్యనే పోటీ ఉంటుందని భావించినా... పట్టభద్రులు మల్లన్నకు పెద్దసంఖ్యలో జై కొట్టారు.

అదే బాటలోనే భాజపా

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... పోడు భూముల విషయంలో సూర్యాపేట జిల్లాలో బహిరంగసభ నిర్వహించి ఉద్యమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర సైతం... ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే ప్రారంభమైంది. ఇలా వివిధ పార్టీలు, పలువురు నాయకులు... రాజకీయాల పరంగా ఉమ్మడి నల్గొండ జిల్లాపైనే దృష్టి సారిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ఇదీ చూడండి: TS Politics: ఈటీవీ భారత్ ప్రత్యేకం... "ధర్మపురి" వారి కుటుంబ కథా చిత్రమ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.