నూతన సంవత్సరం తొలిరోజే కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజగోపాల్‌రెడ్డి అనంతరం ఈ ప్రకటన చేశారు.
2019లో కాంగ్రెస్ శాసనసభ్యుడిగా ఒక ప్రకటన చేశాను. రాష్ట్రంలో భాజపా ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని నేను ప్రకటించాను. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూ ఆనాడే నా అభిప్రాయాన్ని వెల్లడించాను. జాతీయ స్థాయిలో పార్టీ బలహీనపడటం, రాష్ట్రంలో ఎమ్మెల్యేలు తెరాసలో చేరడం లాంటి పరిణామాల మధ్య ఆ ప్రకటన చేశా. అదే ప్రకటనకు కట్టుబడి ఉన్నా. ఆ తర్వాత ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో నేను పాల్గొనలేదు. నా సోదరుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పీసీసీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వారు ఎంత వరకు సఫలం అవుతారనేది కాలమే నిర్ణయిస్తుంది. కోమటిరెడ్డి బ్రదర్స్ భాజపాలో చేరే అవకాశం లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరే అవకాశం ఉంది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగుతారు. తమ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. దుబ్బాక, హుజూర్నగర్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలందరూ భాజపానే ప్రత్యామ్నాయంగా భావించారు. నా నిర్ణయంలో మార్పు ఉండదు. కుటుంబసభ్యులుగా మేము కలిసే ఉంటాం. - కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే.
ఇవీ చూడండి: 4రోజుల్లో సుమారు రూ.760 కోట్ల మద్యం తాగేశారు..