ETV Bharat / city

రేపు అవిభాజ్య నల్గొండ జిల్లాలో మంత్రి కేటీఆర్​ పర్యటన - రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు

రేపు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మంత్రి కేటీఆర్​ పర్యటించనున్నారు. రెండు జిల్లాల పరిధిలోని మూడు పురపాలికల పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టునున్నారు.

minister ktr tour schedule in nalgonda and suryapet districts
రేపు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్న మంత్రి కేటీఆర్​
author img

By

Published : Jun 28, 2020, 10:22 PM IST

Updated : Jun 28, 2020, 11:02 PM IST

రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు... రేపు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్నారు. రెండు జిల్లాల పరిధిలోని మూడు పురపాలికల పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉదయం పదిన్నరకు నల్గొండ జిల్లా చిట్యాల చేరుకోనున్న ఆయన... విద్యుత్​ ఉపకేంద్రాన్ని ప్రారంభించడంతోపాటు మరిన్ని కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్​లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్డీవో కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.

25 కోట్లతో చేపట్టనున్న పనులను ప్రారంభించి జిల్లా యంత్రాంగంతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు నల్గొండ వెళ్లనున్న కేటీఆర్... హరితహారంలో పాల్గొని, పురపాలికలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

ఇవీ చూడండి: కరోనాపై ఆందోళన అవసరం లేదు.. అన్నీ సిద్ధంగా ఉన్నాయి: కేసీఆర్

Last Updated : Jun 28, 2020, 11:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.