ETV Bharat / city

మఠంపల్లిలో రైతు వేదికకు మంత్రి జగదీశ్​రెడ్డి శంకుస్థాపన - minister jagadish reddy started rythu vedika works at matampally

హుజూర్​నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి తండ్రి దివంగత అంకిరెడ్డి స్మారకార్థం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో నిర్మించనున్న రైతు వేదికకు విద్యుత్​ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్​రెడ్డి శంకుస్థాపన చేశారు. రైతు వేదికల నిర్మాణం.. నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు.

minister jagadish reddy started rythu vedika works at matampally
మఠంపల్లిలో రైతు వేదికకు మంత్రి జగదీశ్​రెడ్డి శంకుస్థాపన
author img

By

Published : Jun 12, 2020, 5:27 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండలకేంద్రంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి తండ్రి దివంగత అంకిరెడ్డి స్మారకార్థం రైతు వేదికను నిర్మించేందుకు తలపెట్టిన శంకుస్థాపన కార్యక్రమాన్ని మంత్రి గుంటకండ్ల జగదీశ్​రెడ్డి ప్రారంభించారు. రైతు వేదికల నిర్మాణంతో రైతులకు ఇది నూతన అధ్యాయమని మంత్రి తెలిపారు.

అన్నదాతను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు సీఎం కేసీఆర్​ రైతు వేదికలకు సంకల్పించామన్నారు. మిషన్​ కాకతీయ పథకంతో చెరువుల పునరుద్ధరణ చేపట్టి కృష్ణా, గోదావరి జలాలను మళ్లించామని, రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయ రుణాల మాఫీలతో ప్రభుత్వం అన్నదాతలకు పెద్దపీట వేసిందని మంత్రి అన్నారు.

ఇదీ చదవండి: కరోనా సంక్షోభంలో ల్యాప్​టాప్​ అమ్మకాల జోరు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.