తండ్రి ఆత్మహత్య తర్వాత అమృత మీడియాతో మాట్లాడింది. మారుతీరావు తన తమ్ముడు శ్రవణ్ నుంచి ఎదురైన ఒత్తిడి భరించలేకే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించింది.
కోర్టు ద్వారా మారుతీరావుకి శిక్ష పడాలని కోరుకున్నా కానీ.. ఆత్మహత్య చేసుకుంటాడని ఊహించలేదంది అమృత. చిన్నాన్న శ్రవణ్ ఒత్తిడి, బెదిరింపుల వల్లే మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని ఆమె ఆరోపించింది. చిన్నప్పటి నుంచి మారుతీరావును శ్రవణ్ బెదిరించేవాడని అమృత తెలిపింది. మారుతీరావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అమృత తెలిపింది.