అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్న 20 మంది లబ్ధిదారులకు... శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండలోని తన నివాసంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందించారు. ప్రజా సంక్షేమ కోసం తెలంగాణ ప్రభుత్వ అద్భుతమైన పథకాలను అమలు చేస్తోందన్నారు.
ప్రభుత్వ పథకాలు పేదలకు అందేలా ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారని గుత్తా అన్నారు. సీఎంఆర్ఎఫ్ పేదలకు ఓ వరం లాంటిదని పేర్కొన్నారు. రైతులకు భూ సమస్యలు లేని రాష్ట్రంగా చేయడానికి నూతన చట్టాన్ని తీసుకొచ్చినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెరాస రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి, నాయుకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: గుత్తా సుఖేందర్‌రెడ్డిని కలిసిన టీఎన్జీవో నేతలు