అమ్మే రావాలి...
అమృత నోరు విప్పింది. భర్తను కోల్పోయిన భార్య పరిస్థితి ఎలా ఉంటుందో తనకు తెలుసని, తన తల్లి గిరిజ పరిస్థితి కూడా తనలాగే మారిందని చెప్పింది. అమ్మ ఇప్పుడు ఒంటరిగా మిగిలిందని, తన దగ్గరికి వస్తే.. ఆమె బాధ్యతలు తీసుకుంటానని తెలిపింది. తనకు పెళ్లయి ఓ కుటుంబం ఉందని, అమ్మ దగ్గరికి వెళ్లలేనని.. అమ్మే తన దగ్గరికి వస్తే.. ఆమె బాధ్యతలు తీసుకుంటానని అంది. ఒకవేళ తన అత్తగారింటికి రావడం ఆమెకు నచ్చకుంటే.. వేరే చోట ఉండి అయినా సరే.. అమ్మను బాగా చూసుకుంటానంది అమృత.
శిక్షపడాల్సింది.!
మారుతీరావు ఆత్మహత్య చేసుకోకుండా చట్టం ద్వారా శిక్ష పడితే బాగుండేదని అమృత అభిప్రాయపడింది. ఒక వ్యక్తి తన ప్రాణాలు తీసుకోవడం, ఇతరుల ప్రాణాలు తీయడం చట్టరీత్యా నేరమని, ఏ మనిషికీ ఆ హక్కు లేదని అంది. మారుతీరావు ఈ రెండు తప్పులూ చేశాడంది అమృత.
శ్రవణ్ ఒత్తిడే కారణమా?
మారుతీరావు తన తమ్ముడు శ్రవణ్ ఒత్తిడి, బెదిరింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని ఆమె ఆరోపించింది. తన చిన్నప్పటి నుంచి మారుతీరావును శ్రవణ్ బెదిరించడం చాలాసార్లు చూశానని చెప్పింది అమృత. మిర్యాలగూడలో ఎవరినైనా ఎదిరించగల మారుతీరావు.. తన తమ్ముడు శ్రవణ్‌కు మాత్రం అడ్డు చెప్పేవాడు కాదని తెలిపింది.
ఆస్తి అక్కర్లేదు
రియల్ ఎస్టేట్స్‌లో మారుతీ రావు బాగానే సంపాదించాడు. ఈ క్రమంలో పలుమార్లు తమ్ముడితో మారుతీరావుకు ఆస్తి విషయంలో గొడవలు కూడా అయ్యాయని, ఈ మధ్యే ఆస్తి కూడా పంచుకున్నట్టు అమృత తెలిపింది. ఆస్తుల కోసమే.. అమృత ఇప్పుడు నాటకాలాడుతోందని ఆరోపణలు చేసిన శ్రవణ్ మాటలను అమృత తిప్పి కొట్టింది. మారుతీరావు ఆస్తులు తనకు అవసరం లేదని ప్రకటించింది.