ETV Bharat / city

నల్గొండలో వినియోగదారులతో కళకళలాడుతున్న దుకాణాలు

కరోనా ప్రభావంతో దుకాణాలకు వెళ్లాలంటేనే భయపడ్డ ప్రజలు... శ్రావణమాసం రాగానే షాపింగ్​లు చేస్తున్నారు. నల్గొండ పట్టణంలోని ఎస్పీటీ మార్కెట్​లో బట్టల దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. పెళ్లిలు, పండుగలతో పాటు స్వచ్ఛంద లాక్​డౌన్​ అమలుచేయాలన్న తలంపు వల్లే ప్రజలు ముందస్తు కొనుగోలు చేస్తున్నారని దుకాణాదారులు చెబుతున్నారు.

heavy flow to cloth stores in nalgonda spt market

author img

By

Published : Jul 29, 2020, 6:08 PM IST

నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్పీటీ మార్కెట్లో బట్టల దుకాణాలు వినియోగదారులతో కళకళలాడుతున్నాయి. శ్రావణమాసంలో రాఖీ, రంజాన్, బోనాల పండుగలతో పాటు పెళ్లి ముహూర్తాలు కూడా ఉండటంతో అధిక సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారని దుకాణదారులు చెబుతున్నారు. జిల్లాలో ఈ నెల 30 లేదా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 14 వరకు స్వచ్ఛందంగా లాక్​డౌన్ అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తుండటం వల్ల ముందుగానే కొనుగోలు చేస్తున్నట్లు కొనుగోలుదారులు అంటున్నారు.

గతంలోనే రెండు నెలల లాక్​డౌన్ వల్ల బట్టలు అమ్ముడుపోక తీవ్రంగా ఇబ్బందులు పడ్డామని... జీతాలు ఇవ్వలేక, అద్దెలు కట్టలేక సతమతమయ్యామని ఆవేదన వ్యక్తంచేశారు. పెళ్లిళ్లు, పండుగల సీజన్ కాబట్టి తమకు అమ్ముడు పోయేది ఇప్పుడేనని... మళ్లీ ఈ సమయంలో లాక్​డౌన్​ అమలు చేయటం వల్ల తమకు చాలా నష్టం జరుగుతుందని దుకాణాదారులు వాపోతున్నారు.

ఇవీ చూడండి: గేటెడ్‌ కమ్యూనిటీల్లో కరోనా చికిత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.