CM KCR Yadadri Tour: యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయంగా ఉన్న... శ్రీ పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి శివాలయం పునఃప్రారంభానికి సిద్ధమైంది. నేటి నుంచి ఐదురోజుల పాటు శివాలయ ఆవరణలో స్మార్త "ఆగమశాస్త్ర పద్ధతిలో అత్యంత వైభవంగా మహాకుంభాభిషేక మహోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ ఈవో గీత తెలిపారు.
25వ తేదీ ఉదయం 10.25 గంటలకు ధనిష్ఠా నక్షత్రయుక్త మిథున లగ్నపుష్కరాంశ సముహూర్తమున... శివాలయ పునః ప్రారంభం జరగనుందని చెప్పారు. తొగుట పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతిస్వామి చేతుల మీదుగా... ఉత్సవాలు నిర్వహిస్తామని గీత పేర్కొన్నారు. ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉందని వెల్లడించారు. శివాలయ ప్రతిష్ఠ, ఉపదేవీదేవతల ప్రతిష్ఠ, పంచకుండాత్మక పాంచాహ్నిక దీక్షా విధానంతో 54 మంది ఆచార్య బ్రహ్మ వేదపారాయణ, యజాచార్య, రుత్విక్, పరిచారక బృందంతో ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి:Spacetech Policy: స్పేస్ టెక్నాలజీ పాలసీ ఆవిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వం