Awareness of munagode election of right to vote: మునుగోడు నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకోవాలనే చైతన్యం పెరుగుతోంది. ఒక్కో ఎన్నికకూ పోలింగు శాతం వృద్ధి అవుతోంది. 2020లో నిర్వహించిన పురపాలిక ఎన్నికల్లో చౌటుప్పల్ 93.31 శాతం, చండూరు 92.01 శాతం పోలింగ్‌తో రాష్ట్ర స్థాయిలో ప్రథమ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. చౌటుప్పల్ పురపాలిక రెండో వార్డులో 97.32 శాతం, ఇక్కడి 20లో 19 వార్డుల్లో, చండూరు పురపాలికలో 10లో 8 వార్డుల్లో 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. కొత్తగా ఓటు నమోదు దరఖాస్తులు సైతం ఇక్కడే ఉన్నాయి.
2018 సార్వత్రిక ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలో 91.08 శాతం ఓట్లు పోలయ్యాయి. నవంబరు మూడున నిర్వహించే ఉప ఎన్నికలు పోటాపోటీగా సాగనున్నందున రికార్డు స్థాయిలో పోలింగ్ జరుగుతుందని భావిస్తున్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు సైతం ప్రచారం సాగిస్తున్నారు. 2009 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను అమలులోకి తెచ్చారు. 2018 ఎన్నికల్లో ఈవీఎంలతో పాటు వీవీప్యాట్‌లను ప్రవేశ పెట్టారు. దీంతో ఓటు వేయడం, లెక్కించడం సులువైంది. ఈ ఉప ఎన్నికలో నియోజకవర్గంలో 2,27,268 మంది ఓటర్లున్నారు. మునుపటి కన్నా ఎక్కువ శాతం ఓట్లు పోలయ్యే విధంగా సుదూర ప్రాంతంలోని ఓటర్లను సైతం రప్పించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇవీ చదవండి: