రాష్ట్ర వ్యాప్తంగా కోటి 40 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. 70 లక్షల ఎకరాల్లో పత్తి, 45 లక్షల ఎకరాల్లో వరి, 20 లక్షల ఎకరాలలో కంది పంట సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆయన పేర్కొన్నారు.
పత్తి సాగును తగ్గించి..
రానున్న వానాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పత్తి పంటను అధికంగా సాగు చేసే వారిని తగ్గించే విధంగా అధికారులు ప్రణాళికలు తయారు చేశారని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. గతేడాది 10 లక్షల పైచిలుకు ఎకరాల్లో కంది పంటను సాగు చేశారని.. ఈ వాన కాలంలో 20 లక్షల ఎకరాల పంట సాగు చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు.
చెరువుల పరిశీలన.
వనపర్తి నియోజకవర్గ పరిధిలోని పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో రాజ్యసభ సభ్యుడు పోతుగంటి రాములుతో కలిసి.. మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించారు. అనంతరం వనపర్తి నియోజకవర్గ పరిధిలోని గోపాల సముద్రం చెరువును పరిశీలించారు.
చెరువును పటిష్ఠ పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి నివేదికలు తీసుకువెళతామని.. ఘనపురం మండలంలోని గణప సముద్రం గోపాల్ పేట మండలంలోని బుద్ధారం చెరువులను పునరుద్ధరించేందుకు ప్రణాళికలు రచించారని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే గోపాల్ పేట వనపర్తి, గణపురం పెద్దమందడి మండలాల్లోని చెరువులన్నీ కృష్ణా జలాలతో నిండి ఉన్నాయన్నారు.
మిట్ట ప్రాంతాల్లో ఉండే రైతుల పొలాలకు సాగునీరు అందించేందుకు నియోజకవర్గ పరిధిలో 60 మినీలిస్టులను ఏర్పాటు చేశామన్నారు. తద్వారా మరో 20 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందుతుందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వనపర్తి పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో 161 లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు.
ఇదీ చుడండి: jurala dam: జూన్‌లోనే నిండుగా జూరాల