ETV Bharat / city

Sanitation problems: మురికి కూపాలుగా శివారు కాలనీలు

పట్టణ ప్రగతిలో ఖాళీ ఇళ్ల స్థలాలను గుర్తించి నోటీసులిచ్చి మరీ శుభ్రం చేయించిన మున్సిపల్‌ అధికారులు... మురుగునీటి నిల్వలకు, రోగాలకు ఆవాసాలుగా మారుతున్న బహిరంగ ప్రదేశాలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పలు పట్టణాల్లోని శివారు కాలనీల్లో పారిశుద్ధ్య దుస్థితిపై కథనం.

sanitation works
sanitation works
author img

By

Published : Aug 19, 2021, 6:47 PM IST

పారిశుద్ధ్యంపై ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్న మున్సిపల్, వైద్యారోగ్యశాఖ అధికారులు... పురపాలికల్లోని శివారు ప్రాంతాలను మాత్రం పట్టించుకోవడం లేదు. కొత్తగా ఏర్పడిన కాలనీల్లో మురుగు కాల్వల వ్యవస్థ లేక అస్తవ్యస్తంగా మారుతున్నాయి. ఇళ్లలోని మురుగు, వర్షంనీరు ఖాళీస్థలాల్లో చేరి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. అవే ఖాళీ స్థలాల్లో జనం వ్యర్థాలు పారవేయడంతో... మురికికూపాలుగా తయారవుతున్నాయి. పందులు ఇతర జంతువులు సంచరిస్తూ వ్యాధులను వ్యాపింపజేస్తున్నాయి.

కలెక్టర్​కు విన్నవించుకున్నా..

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో కల్వకుర్తి రోడ్డు సరస్వతి కాలనీ, జోగులాంబ జిల్లా కేంద్రంలోని రాంనగర్‌, కుంటవీధి, నల్లకుంట, చింతల్‌పేట, సంతోష్‌నగర్‌, రెండో రైల్వే గేటు వెనక ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు అత్యంత దారుణంగా మారాయి. భూత్పూర్‌ మున్సిపాలిటీలోనూ మురుగు నీటి నిల్వలు రోగాలకు అడ్డాగా మారుతున్నాయి. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. కలెక్టర్‌ దాకా వెళ్లి మొర పెట్టుకున్నా ఫలితం లేదని ఆరోపిస్తున్నారు.

ఖాళీ ప్రదేశాల్లో మురుగును శుభ్రం చేయాలి..

పట్టణ ప్రగతిలో ఖాళీ ఇళ్ల స్థలాలను గుర్తించి యజమానులకు నోటిసులిచ్చి వాటిని శుభ్రం చేయించిన మున్సిపల్ అధికారులు.. బహిరంగ ప్రదేశాల్లో మురుగు చేరకుండా చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఇంటింటికీ చెత్త సేకరణ, క్రమం తప్పకుండా మురుగు కాల్వలను శుభ్రచేయడం వంటివి సక్రమంగా అమలు కావడం లేదనే అరోపణలు వస్తున్నాయి. అధికారులు మాత్రం దోమలు, సీజనల్ వ్యాధుల నివారణ కోసం అన్నిరకాల చర్యలు చేపడతున్నామని చెబుతున్నారు. ఖాళీ స్థలాల్లో మురుగు చేరకుండా యజమానులకు నోటీసులు ఇస్తామంటున్నారు. కొత్తగా ఏర్పడిన కాలనీల్లో మురుగు కాల్వ నిర్మాణాన్ని చేపట్టామని అంటున్నారు. విషజ్వరాలు విజృంభిస్తున్న వేళ.. బహిరంగ ప్రదేశాల్లో అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చూడండి : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రశ్నార్థకంగా మారిన పారిశుద్ధ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.