ETV Bharat / city

నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 వరకు తుంగభద్ర పుష్కరాలు - Review meeting by Minister Indrakaran Reddy in mahabubnagar

తుంగభద్ర పుష్కరాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ సహా ఇతర ఉన్నతాధికారులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 వరకు పుష్కరాలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. కొవిడ్​ నిబంధనలను తప్పక పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.

Review meeting by Minister Indrakaran Reddy on the management of Tungabhadra Pushkars
తుంగభద్ర పుష్కరాల నిర్వహణపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష
author img

By

Published : Nov 7, 2020, 4:56 PM IST

నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 వరకు తుంగభద్ర పుష్కరాలను కొవిడ్ నిబంధనలకు లోబడి నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. అందుకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్​తో కలిసి జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం, జోగులాంబ అమ్మవారి ఆలయాలను దర్శించుకున్నారు. మహబూబ్​నగర్​ హరిత హోటల్​లో జిల్లా కలెక్టర్ సహా ఇతర ఉన్నతాధికారులతో తుంగభద్ర పుష్కరాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

తుంగభద్ర పుష్కరాల నిర్వహణపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష

పుష్కరాల కోసం ఐదు చోట్ల ఘాట్లు ఇప్పటికే ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. భక్తులు కరోనా వ్యాప్తి చెందకుండా మాస్కులు, శానిటైజర్​లు తప్పకుండా వాడాలన్నారు. శరీర ఉష్ణోగ్రతను కొలిచే యంత్రాలతో పాటు రాపిడ్ యాంటీజెన్ పరీక్షలకోసం శిబిరాలను ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులంతా కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్ నిబంధనలకు లోబడి ఈ ఏడాది తుంగభద్ర పుష్కరాలు సంప్రదాయబద్ధంగా నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

సమావేశంలో దేవాదాయ కమిషనర్ అనిల్ కుమార్, జిల్లా కలెక్టర్ శ్రుతి ఓజా, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యంతర సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.