ETV Bharat / city

పల్లె ప్రగతి పనులు పరిశీలించిన అధికారులు

వనపర్తి జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొదలుపెట్టిన పలు అభివృద్ధి పనులను అధికారులు పరిశీలించారు.

Palle Pragathi Works supervision In vanaparthi District
పల్లె ప్రగతి పనులు పరిశీలించిన అధికారులు
author img

By

Published : Mar 14, 2020, 7:44 PM IST

పల్లె ప్రగతి పనులు పరిశీలించిన అధికారులు

పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాల్లో చేయ తలపెట్టిన అభివృద్ధి పనులను పల్లె ప్రగతి రాష్ట్ర పరిశీలకులు లోకేష్ జైస్వాల్ పరిశీలించారు. వనపర్తి జిల్లాలోని పామాపురం, అమడబాకుల గ్రామాల్లో పల్లె ప్రగతిలో మొదలుపెట్టిన డంపింగ్ యార్డు, వైకుంఠధామం, నర్సరీ పనులను పర్యవేక్షించారు. పనులు ఎంతవరకు వచ్చాయో, పూర్తి చేయడానికి ఎంతకాలం పడుతుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు.

గ్రామాల్లో తిరుగుతూ.. ప్రతీ ఇంటికి ఒక మొక్క విధిగా నాటాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ రాజేశ్వరి, ఎఫ్​డీఓ బాబ్జీరావు, ఎంపీడీఓ కథలప్ప, ఇరు గ్రామాల సర్పంచులు శారద, బుచ్చన్న పాల్గొన్నారు.

ఇదీ చూడండి : పంచాయతీరాజ్​ సమ్మేళనంలో 'ఈటీవీ' కథనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.