ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో.. పరిసరాలను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని 19, 20వ వార్డుల్లో పర్యటించారు. మురికి కాలువలు, చెత్త వేసే ప్రదేశాలు, విద్యుత్ స్తంభాలను పరిశీలించారు.
చెత్తను ఆరుబయట వేయకూడదని.. అలా వేస్తే జరిమానా విధిస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. చెత్త కారణంగానే ఈగలు, దోమలు, పందులు వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు. రోగాల బారిన పడకుండా ఉండటానికి ప్రజలంతా పట్టణ ప్రగతిలో భాగస్వాములు కావాలని కోరారు.
ఇవీ చూడండి: అక్రమ లేఅవుట్ల లెక్క తేల్చేందుకు సర్కారు సిద్ధం