మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో నిర్వహించిన కొవిడ్ టీకా డ్రైరన్ కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాసగౌడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివరాల నమోదు, నిర్వహణ, సౌకర్యాలపై ఆరా తీశారు. జిల్లాలో కొవిడ్‌పై పరిస్థితి ఎలా ఉందని.. ఎన్నికేసులున్నాయని అధికారులను అడిగారు.
డ్రై రన్ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని సూచించారు. 245 మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు డ్రై రన్ నిర్వహిస్తున్నామని మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్ట శ్రీనివాస్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ రఫిక్ మంత్రికి వివరించారు.
ఇవీచూడండి: తెలంగాణ వ్యాప్తంగా 1200 కేంద్రాల్లో కొవిడ్ డ్రైరన్