ప్రజల ఆరోగ్యంపైన ప్రత్యేక దృష్టి: మంత్రి శ్రీనివాస్ గౌడ్ - minister srinivas goud in mahaubnagar
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ ఎయిర్ జిమ్‌ను మంత్రి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ప్రజలు ఆరోగ్యం పెంపొందించుకునేందుకు వీలుగా... జిల్లాలో క్రీడాప్రాంగణాలు, వాకింగ్‌ట్రాక్‌లు, పార్కులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

ఆరోగ్యంగా ఉంటే ఎటువంటి రోగాలు దరి చేరవని అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. అందుకనుగుణంగా.... మహబూబ్‌నగర్ జిల్లాలో క్రీడాప్రాంగణాలు, వాకింగ్‌ట్రాక్‌లు, పార్కులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ ఎయిర్ జిమ్, యోగా శిక్షణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.

దేశంలోనే అతిపెద్ద అర్బన్ ఎకో పార్కును మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేయగా.. స్థానికులకు వెసులుబాటుగా ఉండేందుకు వాకింగ్‌ట్రాక్‌లను సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. మైదానంలో ఓపెన్ ఎయిర్ జిమ్, మహిళల కోసం ప్రత్యేకంగా మరో జిమ్‌తో పాటు యోగా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్టు మంత్రి పేర్కొన్నారు. అనంతరం... మైదానంలో ఏర్పాటు చేసిన ఉచిత పోలీసు శిక్షణ శిబిరాన్ని మంత్రి పరిశీలించారు.
