మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కొత్తచెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్‌లో ఆయన పలు అధికారిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. న్యూటౌన్‌లో అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అప్పనపల్లి, వీరన్నపేట, సద్దలగుండు కాలనీల్లో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. రోడ్డు విస్తరణలో భాగంగా తొలగిస్తున్న సవేరా హోటళ్ల, ఇతర దుకాణాలను మంత్రి పరిశీలించారు. కొత్త చెరువులో చేప పిల్లలను వదిలారు. అప్పన్నపల్లి ఆర్ఓబి విస్తరణ కోసం ఎంపీతో కలిసి స్థలాన్ని పరిశీలించారు.
చెరువు మధ్యలో రెస్టారెంట్:
30ఏళ్ల తర్వాత కొత్తచెరువులోకి భారీ ఎత్తున నీరు చేరిందని, చేపలతో పాటు రొయ్యలూ వదులుతామన్నారు. చెరువు కింద ఉన్న 50 మత్స్య కుటుంబాలకు ఉపాధి కల్పిస్తామన్నారు. కొత్త చెరువు మధ్యలో ఉన్న స్థలంలో ఒక రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయించి.. పర్యాటకంగా కూడా అభివృద్ధి చేస్తామన్నారు. పర్యాటకులు ఈ రెస్టారెంట్‌కి చేరుకునేలా బోటు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. త్వరలోనే ఎదిర సమీపంలో అతిపెద్ద పరిశ్రమ రాబోతున్నదని.. అందులో యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు.
ఇదీ చూడండి: సినీ ఫక్కీలో కార్యాలయంపై దాడి... మంటల్లో ఫర్నిచర్