ETV Bharat / city

'పల్లె ప్రకృతి వనాల ప్రక్రియను వేగవంతం చేయాలి'

నవంబర్‌ 8లోగా రైతు వేదికలతో పాటు గ్రామాల్లో సుందరీకరణ పనులను పూర్తి చేయాలని అధికారులను మహబూబ్‌నగర్ జిల్లా పాలనాధికారి ఎస్.వెంకటరావు ఆదేశించారు. పల్లె ప్రకృతి వనాలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

mahabubnagar collector review meeting with officers on Prakruthi vanaalu
'పల్లె ప్రకృతి వనాల ప్రక్రియను వేగవంతం చేయాలి'
author img

By

Published : Nov 6, 2020, 7:36 PM IST

పల్లె ప్రకృతి వనాల ప్రక్రియను వేగవంతం చేయాలని మహబూబ్‌నగర్ జిల్లా పాలనాధికారి ఎస్.వెంకటరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో పల్లె ప్రకృతి వనాలపై అదనపు కలెక్టర్లు, జిల్లా సీనియర్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. 660 ఆవాస గ్రామాలకు గాను 534 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల పనులను చేపట్టామని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

శనివారం సాయంత్రంలోగా వనాలకు భూమి గుర్తించి తక్షణమే పనులు చేపట్టాలని మండల సర్వేయర్లు, డిప్యూటీ తహసీల్దారును ఆదేశించారు. అందుకు సంబంధించి అంచనాలను తక్షణమే జనరేట్ చేయాలని ఎంపీడీవో, ఏపీఓలను, పంచాయతీ కార్యదర్శలకు మార్గదర్శకాలు జారీ చేశారు. నవంబర్‌ 8 లోగా రైతు వేదికలతో పాటు గ్రామాల్లో సుందరీకరణ పనులను పూర్తి చేయాలన్నారు. లేకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని మండల, గ్రామస్థాయి అధికారులకు కలెక్టర్ హెచ్చరించారు.

ఇదీ చూడండి: పట్టభద్రుల ఓటు నమోదుకు మరో అవకాశం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.