ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రోజురోజుకు మహమ్మారి విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 347 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లాలో అత్యధికంగా 166 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా మహబూబ్‌నగర్ జిల్లాలో గతంలో పాజిటివ్ వచ్చిన మృతి చెందగా.. నవాబుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన నెల రోజుల చిన్నారి హైదరాబాద్ నిలోఫర్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
జోగులాంబ గద్వాల జిల్లా 166 కేసులు
- అలంపూర్‌లో- 51
- అయిజ-28,
- గద్వాలలో- 21
- ధరూరు-16
- వడ్డేపల్లి- 15
- ఇటిక్యాల- 9
- గట్టు- 8
- మల్దకల్-7
- మానవపాడు- 6
- రాజోలిలో- 4గా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మహబూబ్‌నగర్ జిల్లాలో 80 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.
- మహబూబ్‌నగర్-50
- జడ్చర్లలో-12
- సీసీకుంట-5,
- బాలానగర్-4,
- మిడ్జిల్- 3,
- అడ్డాకుల-3 చొప్పున కేసులు నమోదుకాగా.. మూసాపేట, భూత్పూరు, గండీడ్ మండలాల్లో ఒక్కొక్కరు కరోనా బారిన పడ్డారు.
వనపర్తి జిల్లాలో మొత్తం 50మందికి వైరస్ సోకింది.
- వనపర్తి కేంద్రంలో 27
- పెబ్బేరు- 9
- గోపాల్‌పేట- 4, మదనాపురం, ఆత్మకూరులో ముగ్గురికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
నాగర్‌కర్నూల్‌జిల్లాలో 42
జిల్లా కేంద్రంతో పాటు మండల పరిధిలో 14 మందికి పాజిటివ్ వచ్చింది. కొల్లాపూర్, కల్వకుర్తిలో ఆరుగురి చొప్పున కొవిడ్ బారిన పడ్డారు. అచ్చంపేట 4, అమ్రబాద్ 3, వెల్దండ 3, తిమ్మాజీపేట, వంగూరు, ఊర్కొండ, పదర, లింగాల, బిజినేపల్లిలో ఒక్కొక్కరికి కరోనా నిర్ధారణ అయ్యింది.
నారాయణపేట జిల్లాలో నమోదైన 9 కేసుల్లో.. 3 జిల్లా కేంద్రానికి చెందినవే. ఉట్కూరు 3, ధన్వాడ, కోస్గి, దామరగిద్దలో ఒక్కొక్కరు కరోనా బారిన పడ్డారు.
ఇవీచూడండి: భారత్ బయోటెక్ ల్యాబ్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్