ETV Bharat / city

కరోనా వేళ అందుబాటులోకి నాలుగు బస్తీ దవాఖానాలు - తెలంగాణ తాజా వార్తలు

హైదరాబాద్‌ తరహాలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో తొలిసారిగా బస్తీ దవాఖానాలు ప్రారంభమమయ్యాయి. పాలమూరులో నాలుగు బస్తీ దవాఖానాలు అందుబాటులోకి రావడంతో కరోనా సమయంలో సాధారణ ఆసుపత్రులపై పడుతున్నభారం తగ్గడంతో పాటు.... ప్రజలకు దగ్గర్లోనే వైద్యసేవలు అందనున్నాయి. కొవిడ్ కారణంగా ఆసుపత్రులకు వెళ్లేందుకు భయపడుతున్న సాధారణ రోగులకు... కాస్త ఉపశమనం లభించనుంది.

కరోనా వేళ అందుబాటులోకి నాలుగు బస్తీ దవఖానాలు

author img

By

Published : May 25, 2021, 5:17 AM IST

కరోనా వేళ అందుబాటులోకి నాలుగు బస్తీ దవఖానాలు

కొవిడ్ రెండోదశ కారణంగా మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిపై పనిభారం భారీగా పెరిగింది. మహబూబ్‌నగర్‌లోని 4 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లోనూ పరీక్షలు, టీకాలు, కోవిడ్ ఓపీ, సాధారణ రోగులతో అక్కడి వైద్యులు, సిబ్బందిపైనా ఒత్తిడి పెరుగుతోంది. ఆ సమస్య పరిష్కరించే దిశగా జిల్లా వైద్యారోగ్యశాఖ తొలిసారిగా పట్టణంలో నాలుగు బస్తీ దవాఖానాలు ప్రారంభించింది. నిరుపేద కుటుంబాలు అధికంగా నివసించే ఎనుగొండ, టీడీ గుట్ట, వీరన్నపేట, ధోబీవాడల్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతమున్న యూహెచ్​సీ లతోపాటు వీటిలో వైద్యసేవలు అందనున్నాయి. బస్తీ దవాఖానాలు కేవలం కొవిడ్‌ రోగులకు కాదని.... ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ సూచించారు.
కొవిడ్‌ రోగులకూ మందులందిస్తారు..

కరోనాకు భయపడి సాధారణ రోగులు కోవిడ్ ఓపీ సేవలున్న చోటకు వైద్యం కోసం వెళ్లట్లేదు. అలాంటి వారికి బస్తీదవాఖానాలు ఉపయోగపడనున్నాయి. ఇక్కడ సాధారణ పరీక్షలు, సాధారణ చికిత్సలుమాత్రమే అందిస్తారు. స్వల్పలక్షణాలు ఉన్న కొవిడ్‌ రోగులకూ మందులందిస్తారు. ప్రతిదవాఖానాలో ఓ వైద్యాధికారి, స్టాఫ్‌నర్స్,ఫార్మసిస్టు సహా ఆయా ప్రాంతాల పరిధిలోని ఎఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు సేవలు అందిస్తారు ఆసుపత్రులకు కావాల్సిన మందులు, సామాగ్రి పంపిణీ చేశారు. ప్రజలకు బస్తీ దవాఖానాలు ఎంతో ఉపయోగపడతాయని వైద్యాధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

సర్కారు దవాఖానాకు వెళ్లాలంటే..

బస్తీ దవాఖానాల ఏర్పాటుపై స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు దవాఖానాకు వెళ్లాలంటే రెండు మూడు కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేదని..ఇప్పుడు అత్యంత సమీపంలో వైద్య సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల వారికీ బస్తీ దవాఖానాలు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. బస్తీ దవాఖానాల్లో రోగ నిర్ధారణ పరీక్షలు, ఇన్ పేషెంట్ సేవలు ప్రస్తుతానికి అందుబాటులో లేవు. వీలైనంత త్వరగా వాటిని అందుబాటులోకి తేవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చూడండి: ఆపాత శిల్పం... మహిమ అమోఘం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.