tiger roaming in pinapaka: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ పరిధిలోని ఆళ్లపల్లి మండలం చింతోళ్లగుంపు అడవుల్లో పులి సంచారం చేస్తుందన్న ఆనవాళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. చింతోళ్ల గుంపు అటవీ ప్రాంతంలోకి వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిన రైతులకు పులి అడుగులు కనిపించాయి. దాంతో సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని పాదముద్రలను గుర్తించారు.

అమ్మో పులి..
ఆళ్లపల్లి రేంజర్ నర్సింహారావు దీనిపై స్పందిస్తూ.. లక్ష్మిదేవిపల్లి మండలం చింతకుంట గ్రామ అటవీ మార్గం గుండా సంచరిస్తూ ఆళ్లపల్లిలోని చింతోళ్లగుంపు వైపుగా వెంకటాపురం అడవుల్లోకి పులి వెళ్లినట్లు పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితం భద్రాద్రి జిల్లాలో ఇల్లందు, గుండాల నియోజకవర్గాల్లో పులి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. మరోసారి పులి కదలికలు కనపడడం ఏజెన్సీ ప్రాంతంలోని స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది.

ఇదీ చదవండి:పులుల అభయారణ్యం నుంచి ప్రజల తరలింపు..