పార్టీ కార్యాలయం నుంచి..
కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి కూడా భారీ ర్యాలీతో నామినేషన్ వేశారు. జిల్లా హస్తం పార్టీ కార్యాలయం నుంచి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, సీనియర్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, వీహెచ్, భట్టి విక్రమార్కతో కలిసి నామినేషన్ వేశారు.
38 నామపత్రాలు:
భాజపా తరఫున వాసుదేవరావు, న్యూడెమోక్రసీ నుంచి వెంకటేశ్వరరావుతో పాటు మరికొంత మంది స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు సమర్పించారు. ఖమ్మం లోక్సభ స్థానానికి 38 నామపత్రాలు దాఖలైనట్లు సమాచారం.
ఇదీ చదవండిఃతెరాస ప్రచార తార జాబితాలో హరీశ్