ఏ పదవిలో ఉన్నా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం ఉంటే వారి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వైరాలో ప్రముఖ రాజకీయవేత్త బొర్ర వెంకటేశ్వర్లు ప్రథమ వర్ధంతిలో ఆయన పాల్గొన్నారు. దశాబ్దాలుగా వైరా ప్రాంతంలో బొర్ర వెంకటేశ్వర్లు కుటుంబం... ప్రజలకు విశేష సేవలందించారని వారి స్ఫూర్తితో అనేకమంది రాజకీయాల్లో రాణిస్తున్నారని పొంగులేటి కొనియాడారు. కమ్యూనిస్టు కంచుకోటగా ఉన్న వైరాలో బొర్రా వెంకటేశ్వర్లు కాంగ్రెస్ నేతగా అనేక పదవులు చేపట్టి వివాదరహితుడిగా గుర్తింపు సాధించారని అన్నారు.
పొంగులేటితో పాటు సంతాప సభలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ గంగిరెడ్డి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సంతాప సభకు ముందు బొర్ర వెంకటేశ్వర్లు కుటుంబాన్ని ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, లావుడియా రాములు నాయక్, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, డీసీఎంఎస్ ఛైర్మన్ రాయల వెంకట శేషగిరిరావుతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పరామర్శించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో రాజకీయ కాకరేపుతున్న ప్రశాంత్ కిశోర్ వ్యవహారం