సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బోనస్ ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు కార్మికుల తరుఫున పాదాభివందనం చేస్తున్నట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు చెప్పారు. ప్రతి కార్మికునికి ఒక లక్ష 899 రూపాయలు బోనస్ ప్రకటించారని...దీనికి ఆదాయపన్ను ఉండదని స్పష్టం చేశారు. కార్మికులు మంచి ఉత్పత్తి సాధిస్తున్నారు కాబట్టే సీఎం బోనస్ ప్రకటించారని పేర్కొన్నారు. భాజపాకు భయపడి బోనస్ పెంచారనడం అపోహ మాత్రమేనని కొట్టిపారేశారు. సింగరేణిలో భాజపా అనుబంధ సంఘం బలపడటం అసాధ్యమని చెప్పారు.
ఇవీ చూడండి:అసెంబ్లీ ఇన్నర్ లాబీల్లో ఎమ్మెల్యేల వాగ్వాదం