పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తోడ్పాటుతో ఖమ్మం నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. జిల్లా కలెక్టర్ కర్ణన్, నగర కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి... ఇవాళ ఉదయం సైకిల్‌పై పర్యటించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అలసత్వం వహిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడో పట్టణ ప్రాంతంలో రంగనాయకులగుట్ట వీధి వెడల్పు పనులకు అడ్డంగా ఉన్న స్తంభాలు తొలిగించాలని విద్యుత్ అధికారులను మంత్రి ఆదేశించారు. రోడ్ల నాణ్యతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులకు సూచనలు చేశారు. రైతుబజార్, మయూరి కూడలి, కాల్వొడ్డు, వ్యవసాయ మార్కెట్ ప్రాంతంలోని స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చూడండి: రెండో రోజు కొనసాగుతున్న సచివాలయం కూల్చివేత పనులు