ETV Bharat / city

మావోయిస్టు డిప్యూటీ కమాండర్ లొంగుబాటు - భద్రాచలంలో మావోయిస్టు లొంగుబాటు

మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చక జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు ఓ మహిళా మావోయిస్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ముందు లొంగిపోయారు. ఆమెకు రావాల్సిన అన్ని రివార్డులు, రాయితీలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని భద్రాచలం ఏఎస్పీ రాజేష్​చంద్ర అన్నారు.

maoist surrender at bhadradri kothagudem district
ఏఎస్పీ రాజేష్ చంద్ర ఎదుట లొంగిపోయిన మహిళా మావోయిస్టు
author img

By

Published : Oct 22, 2020, 2:44 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఏఎస్పీ రాజేష్​ చంద్ర ఎదుట మహిళా మావోయిస్టు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చక జనజీవన స్రవంతిలో కలిసేందుకు పార్టీ నుంచి బయటకు వచ్చి లొంగిపోయినట్లు ఏఎస్పీ వివరించారు. కలుమ దేవి 2014 నుంచి మావోయిస్టు పార్టీలో శబరీ ఎల్వోఎస్ డిప్యూటీ కమాండర్​గా పనిచేసినట్లు తెలిపారు.

మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న ఆమె జనజీవనంలో కలిసిపోతున్నందుకు రాజేష్​చంద్ర సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రివార్డులు, రాయితీలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏఎస్పీ హామీ ఇచ్చారు.

ఇదీ చదవండిః ప్రేమ వివాహం.. కొద్దినెలల్లోనే గర్భవతి బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.