'విద్యాభివృద్ధితో పాటు సమాజాభివృద్ధికి నరసింహారావు కృషి' - ఖమ్మం జిల్లా వార్తలు
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన మాదినేని నరసింహారావు సన్మాన సభ మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నరసింహారావు స్ఫూర్తితో ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని ఖమ్మం డీసీఎంఎస్ ఛైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు కోరారు. ఉపాధ్యాయులకు స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు సహకారం అందించాలని సూచించారు.
సమాజానికి దిశానిర్దేశం చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఖమ్మం డీసీఎంఎస్ ఛైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు అన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన మాదినేని నరసింహారావు సన్మానసభ నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విద్యాభివృద్ధితో పాటు సమాజాభివృద్ధికి నరసింహారావు చేసిన కృషిని అభినందించారు.
పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన, విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేస్తూ ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయుని డీసీఎంఎస్ ఛైర్మన్‌తో పాటు ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు పలువురు ప్రజా ప్రతినిధులు సన్మానించారు. నరసింహారావు స్ఫూర్తితో ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. వారికి స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు సహకారం అందించాలని సూచించారు.
గ్రామస్థాయిలో పనిచేసే ఉపాధ్యాయుడిని శాసనసభలో అభినందించడం రాష్ట్రస్థాయి అవార్డు ప్రకటించడం తల్లాడ మండలంతో పాటు ఖమ్మం జిల్లాకు కూడా గుర్తింపు తెచ్చిందని ప్రశంసించారు.
ఇవీ చూడండి: ఎవరికో కొమ్ము కాస్తూ.. సంస్కారానికి నిప్పు పెట్టేశారే!