ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన ఓ వ్యక్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏన్కూరు మండలంలో పని కోసం వెళ్లాడు. లాక్‌డౌన్ వల్ల యజమాని అతడిని పని నుంచి తీసేశాడు. ఆ కార్మికుడు తన సామాను నెత్తిన పెట్టుకొని స్వగ్రామానికి నడుచుకుంటూ బయల్దేరాడు. ఖమ్మం జిల్లా ఇల్లందు క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు అతన్ని గుర్తించారు. అతని వివరాలు తెలుసుకుని భోజనం, మంచినీళ్లు అందించారు. స్వగ్రామానికి ఆటోలో పంపించి తమ ఔదార్యం చాటారు.
ఇదీ చూడండి:- లక్ష్మణరేఖ దాటకుండా కరోనాను జయిద్దాం