ETV Bharat / city

ఆ ఇంటిపన్ను అక్షరాల రూ.4.58 లక్షలట!

ఖమ్మం నగరంలో ఇంటి పన్నులకు రెక్కలొచ్చినట్టున్నాయి. ఒక్కో ఇంటికి లక్షలు, వేల రూపాయల బిల్లులు చెల్లించాలంటూ తాఖీదులిస్తున్నారు. నగరపాలక సిబ్బంది నిర్వాకంతో... రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబాల్లో గుబులు పుడుతోంది. పన్నులు కట్టే స్తోమత లేక నగరవాసులు తలలు పట్టుకుంటున్నారు.

ఖమ్మంలో ఈ ఇంటిపన్ను కేవలం4లక్షలే
author img

By

Published : Aug 29, 2019, 6:47 AM IST

Updated : Aug 29, 2019, 7:26 AM IST

ఖమ్మంలో ఈ ఇంటిపన్ను కేవలం 4లక్షలే

పూల వ్యాపారికి అక్షరాలా రూ. 4 లక్షల 58 వేలు... రోజువారీ కూలీకి రూ.70 వేలు, ఇళ్లల్లో పని చేసుకునే మహిళ కుటుంబానికి రూ.61 వేలు... ఇవి ప్రభుత్వ పథకాల్లో వారికి అందిన ఆర్థిక సాయం అనుకుంటే... మీరు మున్సిపాలిటీ మురుగులో కాలేసినట్టే! సాక్షాత్తు అవి ఇంటి పన్నులు. అంతేకాదు కనీసం నల్లా కనెక్షన్ కూడా లేని వారికి... ఒకటి, రెండు గదుల్లో సర్దుకునే నిరుపేదలకు వేలల్లో పన్ను చెల్లించాలన్న సిబ్బంది ఆదేశాలతో కంగుతింటున్నారు. చిన్నచిన్న ఇళ్లక్కూడా లక్షలు, వేలల్లో ఇంటి పన్నులేస్తున్న ఖమ్మం నగరపాలక సిబ్బంది నిర్వాకంపై ప్రత్యేక కథనం...

ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ ...

ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని వేణుగోపాల్​నగర్ కాలనీకి చెందిన వీరిది విచిత్రమైన సమస్య. గతంలో ఖానాపురం హవేలీ గ్రామపంచాయతీగా ఉండేది ఈ కాలనీ... కార్పొరేషన్​లో విలీనమైనప్పటి నుంచీ ఏటా ఇంటిపన్ను కడుతూనే ఉన్నారు. నాలుగేళ్ల నుంచి సిబ్బంది విధిస్తున్న ఇంటిపన్నులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రోజువారీ కూలీ పనులతో జీవనం సాగించే తమ ఆదాయం కంటే ఇంటిపన్నే ఎక్కువ వచ్చిందని కాలనీవాసులు వాపోతున్నారు.

ఎస్​కే బాబామియా అనే వ్యక్తి... ఇంతకు ముందు ఏటా 104 రూపాయల ఇంటిపన్ను చెల్లించేవాడు. గతేడాది 3 లక్షలు, ఈసారి ఏకంగా 4లక్షల 58వేలు కట్టాలంటూ... నగరపాలక సిబ్బంది ఇచ్చిన తాఖీదులతో కంగుతిన్నాడు. ఇళ్లల్లో పనిచేసుకుంటూ... కుటుంబాన్ని పోషించుకునే ఓ మహిళది ఇదే పరిస్థితి. కేవలం రెండు గదుల్లో నివాసముంటున్న ఈమెకు రూ.70వేలు విధించారు. వీరికే కాదు... వేణుగోపాల్ నగర్, ఖానాపురం హవేలీ కాలనీల్లో ఉంటున్న చాలా మందిది ఇదే ముచ్చట. బల్దియాను ఆశ్రయించినా ఫలితమేమీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఏడాది చివరన ఇంటిపన్ను కాగితాలు చేతిలో పెడుతున్నారని వాపోయారు.

నల్లా కనెక్షనే లేదు...

అసలే అధిక ఇంటి పన్నులతో తలలు పట్టుకుంటున్న కాలనీవాసులకు మరో సమస్య చుక్కలు చూపిస్తోంది. కనీసం నల్లా కనెక్షన్ లేని వారికి కూడా వేలల్లో పన్ను కట్టాలంటూ వస్తున్న తాఖీదులు తలనొప్పిగా మారాయి. కనెక్షన్ కోసం కాళ్లరిగేలా తిరిగినా పలకని అధికార యంత్రాంగం... పన్ను ఎలా విధిస్తారని కాలనీవాసులు మండిపడుతున్నారు. నెలకు 150 రూపాయలు చెల్లించాల్సి ఉండగా... 6 నుంచి 8వేల రూపాయలు చెల్లించాలని రశీదులు ఇస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంప్యూటర్ తప్పిదమంటూ కార్పొరేషన్ కమిషనర్ సమాధానమివ్వడం ఆశ్చర్యం కలిగిస్తోందంటున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం దృష్టిసారించి తమకు న్యాయం చేయాలని వేణుగోపాల్ నగర్, ఖానాపురం హవేలీ కాలనీ వాసులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: కొబ్బరిచెట్టు సీమంతం చూతము రారండి!

sample description
Last Updated : Aug 29, 2019, 7:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.