ఖమ్మం జిల్లా మధిరలో సీఎల్పీ లీడర్, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క పేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించారు. పురపాలక కౌన్సిలర్లు మల్లాది వాసు సవితల సహకారంతో హనుమాన్ కాలనీ, ఎంప్లాయిస్ కాలనీ, ముస్లి కాలనీ, వరద రాఘవాపురం కాలనీల్లో వెయ్యి మంది నిరుపేదలకు సరుకులు పంపిణీ చేశారు. లాక్డౌన్ సమయంలో పేదలు తిండికి ఇబ్బంది పడకుండా వారికి సాయం చేయడం, అండగా నిలబడడం అందరి భాద్యత అన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. పేదలకు సాయం చేసేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు భట్టి.
ఇవీ చూడండి: తెలంగాణలో రెడ్, ఆరెంజ్, గ్రీన్‌జోన్ జిల్లాలివే...