ETV Bharat / city

Chetana Foundation: విద్యార్థులకు, మహిళలకు చేయూతగా నిలుస్తోన్న 'చేతన' - chetana foundation khammam

విద్యార్థులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షం. అన్నార్థులు, అభాగ్యుల ఆకలి తీర్చే ఆపన్నహస్తం. స్త్రీ సాధికారతే లక్ష్యంగా పనిచేస్తోంది చేతన ఫౌండేషన్‌(Chetana Foundation). ఐదేళ్ల క్రితం ఎన్నారై దంపతులు మొదలుపెట్టిన సేవా కార్యక్రమాలు.... ఎందరికో అండగా నిలుస్తున్నాయి.

chetana foundation charity programs for students and women
chetana foundation charity programs for students and womenchetana foundation charity programs for students and women
author img

By

Published : Nov 16, 2021, 4:36 AM IST

పూర్వ ఖమ్మం జిల్లా ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గంధంపల్లికి చెందిన వెనిగళ్ల రవి, రేణుక దంపతులకు... సేవా కార్యక్రమాలు చేపట్టడం వారికి అభిరుచి. వెనిగళ్ల రవి ఇంజినీరింగ్ తర్వాత అనేక ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు చేశారు. 2000 వ సంవత్సరంలో అమెరికా పయనమయ్యారు. ఆరిగాన్ రాష్ట్రం పోర్ట్ ల్యాండ్ సిటీలో ఐటీ ఉద్యోగిగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన భార్య రేణుక మరో ప్రైవేటు సంస్థలో ఉద్యోగిగా పని చేస్తున్నారు. 2011లో స్వదేశానికి వచ్చిన సమయంలో స్వగ్రామంలో ఆర్థిక స్థోమత బాగోలేక ఇద్దరు కూతుళ్లను పాఠశాల మాన్పించిన దంపతులను చూసి చలించిపోయారు. చదవుల్లో ముందంజలో ఉన్న బాలికలను చూసి చదివించాలని నిర్ణయించుకున్నారు. వారిలో ఒక అమ్మాయికి చదువు పూర్తయ్యే వరకు అయిన ఖర్చంతా భరించారు. అలా మరో కూతురును తల్లిదండ్రులు చదివించుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ మంచి ఉద్యోగాలు సంపాదించి స్థిరపడ్డారు. ఇలా ప్రారంభమైన వారి సేవా కార్యక్రమాల పరంపర నిరంతరంగా సాగుతుంది.

నిస్వార్థ సేవే ఏకైక లక్ష్యంగా..

అమెరికా వెళ్లిన తర్వాత సేవా కార్యక్రమాలపై తీవ్రంగా ఆలోచించిన వెనిగళ్ల రవి దంపతులు పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడంతోపాటు సేవా భావాన్ని చాటాలన్న లక్ష్యంతో 2016 డిసెంబర్ 24 న చేతన ఫౌండేషన్ పేరిట సేవలు ప్రారంభించారు. నిస్వార్థ సేవే ఏకైక లక్ష్యం నినాదంతో సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. జాతి, మత, కుల, భాష, సాంస్కృతిక, రాజకీయ నేపథ్యంతో సంబంధం లేకుండా కేవలం సమాజ సేవ కోసం ఆవిర్భావించిన చేతన ఫౌండేషన్‌ అందుకు అనుగుణంగానే సేవా తత్పరతను చాటిచెబుతోంది. దేశంలోని దిల్లీ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలకు చేతన సేవలు విస్తరించారు. అంతేకాదు అమెరికాలోని 12 నగరాల్లో సేవలు కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారత్, అమెరికా, కెనడా, ఉగాండా, నైజీరియా దేశాల్లో సేవలు కొనసాగుతున్నాయి. చేతన ఫౌండేషన్‌ను 25 మంది మిత్రబృందం కలిసి నడుపుతున్నారు. దేశవ్యాప్తంగా వెయ్యి మంది వాలంటీర్స్ చేతన సేవల్లో భాగస్వాములయ్యారు.

విద్యార్థులు, మహిళలకు చేయూత..

తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనతో పాటు ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాలో వందలాది మంది పేద ప్రతిభావంతులైన విద్యార్థులకు హాస్టళ్లలో వసతి ఫీజులను చేతన ఫౌండేషన్‌ చెల్లిస్తోంది. రాష్ట్రంలోని 10 ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేసుకుని మౌలిక వసతుల అభివృద్ధికి ప్రతి పాఠశాలకు 25వేల చొప్పున అందిస్తున్నారు. మహిళలు స్వశక్తి మీద ఆర్థికాభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో చేతన సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించినప్పుడే ఇల్లు, కుటుంబం తద్వారా సమాజం వృద్ధి సాధ్యపడుతుందని భావించి మహిళల అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.