ETV Bharat / city

అక్కకు జీవితాంతం గుర్తుండిపోయే బహుమతి ఇచ్చిన తమ్ముడు - ఖమ్మం వార్తలు

Tulabharam for sister: తాను పుట్టిన తర్వాత 12 ఏళ్లకు తమ్ముడు పుట్టాడు. ఆ అక్క తమ్ముడ్ని అల్లారి ముద్దుగా పెంచింది. తమ్ముడు అంటే ఎంతో ప్రేమ. తమ్ముడికి కూడా అక్క అంటే చాలా ఇష్టం. తనను చిన్నప్పటి నుంచి తల్లి తర్వాత తల్లిగా ప్రేమించింది. అక్కకు పెళ్లి అయ్యి వెళ్లిపోయింది. తిరిగి రాఖీ పండుగకు తమ్ముడికి రాఖీ కట్టడానికి వచ్చింది. జీవితాంతం గుర్తు ఉండేలా చేయాలనుకున్నాడు ఆ తమ్ముడు. చిన్నప్పటి నుంచి తాను దాచుకున్న ప్యాకెట్‌ మనీని అక్కకు తులా భారంలా ఇవ్వాలనుకున్నాడు. బంధు మిత్రులను పిలిచి వేడుకగా తులాభారం ఏర్పాటు చేశాడు.

Tulabharam for sister
Tulabharam for sister
author img

By

Published : Aug 12, 2022, 7:56 PM IST

Updated : Aug 12, 2022, 8:20 PM IST

Tulabharam for sister: ఖమ్మం నగరం శివారు రోటరీనగర్‌ కాలనీలో నివాసం ఉండే బొలగానీ బస్వనారాయణ, అరుణ దంపతులకు ఇద్దరు పిల్లలు. పెద్దమ్మాయి రణశ్రీ పుట్టిన 12ఏళ్ల తర్వాత త్రీవేది పుట్టాడు. అక్కకు తమ్ముడు అంటే ఎంతో ఇష్టం. అమ్మ తర్వాత అమ్మగా ఎంతో ప్రేమగా చూసుకునేది. అక్క అంటే తమ్ముడికి కూడా చాలా ఇష్టం. రణశ్రీకి ఇటీవల వివాహం అయ్యింది. భర్తతో పాటు హైదరాబాద్‌లో ఉంటున్నారు.

తొలిసారి రాఖీ పండుగకు ఖమ్మం వచ్చారు. తన అక్కకు జీవితాంతం గుర్తుండి పోయేలా బహుమానం ఇవ్వాలనుకున్నాడు. బంధు మిత్రులను పిలిచి వేడుకగా రాఖీ పౌర్ణమీని నిర్వహించాడు. అక్కకు తులాభారంగా తాను దాచుకున్న పాకెట్‌ 56వేల రూపాయలను 5రూపాయల బిల్లలుగా మార్చాడు. అక్క బరువుతో సమానంగా తూచి ఇచ్చాడు. ఇలా తన అక్కపై ఉన్న ప్రేమను చూపించాడు. తమ్ముడు చూపించిన ప్రేమకు అక్క ఎంతో మురిసి పోయింది. తమ్ముని బహుమతి జీవితాంతం గుర్తుండిపోయేలా ఉందని సంతోషం వ్యక్తం చేసింది.

రాఖీ కట్టినందుకు అక్కకు తులాభారం నిర్వహించిన తమ్ముడు

Last Updated : Aug 12, 2022, 8:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.