అంతిమంగా న్యాయం వైపు ఎర్ర జెండా ఉండాలని.. ధర్మం వైపు పోరాడాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఖమ్మంలో ఏఐటీయూసీ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. రోటరీనగర్‌లో ప్రదర్శన చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడాలంటే ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రికి వెన్నముకలో వణుకు పుట్టాలని కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.
దేశంలో ఎర్ర జెండా మరింత బలపడాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాల్లో, మండలాల్లో ఏఐటీయూసీ మరింత విస్తరించాలన్నారు. ప్రతి ఒక్క కార్మికుడిని కలిసి సంఘాలు ఏర్పాటు చేయాలన్నారు. 'ఖమ్మం జిల్లా ఎర్ర జెండా ఖిల్లా' అనే నినాదాన్ని నిజం చేయాలన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని సూచించారు.