Person inappropriate comments on cbn on social media: తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఖమ్మం టేకులపల్లికి చెందిన వ్యక్తికి తెలుగు తమ్ముళ్లు దేహశుద్ధి చేశారు. టేకులపల్లికి చెందిన నర్సింహ అనే వ్యక్తి ఫేస్బుక్లో నారా బ్రాహ్మణిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఇది గమనించిన తెదేపా నాయకులు, కార్యకర్తలు నర్సింహపై దాడి చేశారు. నగరంలోని సంభానీనగర్లో నర్సింహ ఉన్నాడని తెలుసుకున్న తెదేపా కార్యకర్తలు తొలుత అతడితో వాగ్వాదానికి దిగారు. అనంతరం నర్సింహకు దేహశుద్ధి చేశారు.
ఇవీ చదవండి: