ETV Bharat / city

స్వైన్​ ఫ్లూతో బాలింత మృతి - బిడ్డకు జన్మనిచ్చి మృతి

స్వైన్​ఫ్లూతో గాంధీ ఆస్పత్రిలో చేరిన బాలింత పండంటి బిడ్డకి జన్మనిచ్చి మరణించింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె మరణించిందంటూ మృతురాలి బంధువులు ఆందోలనకు దిగారు.

with swine flu hospitalized women postpartum  dead in gandhi hospital
స్వైన్​ ఫ్లూతో బాలింత మృతి
author img

By

Published : Feb 24, 2020, 9:03 AM IST

Updated : Feb 24, 2020, 9:27 AM IST

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో స్వైన్​ ఫ్లూతో చేరిన బాలింత మృతి చెందింది. ఐదు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన కరీంనగర్​కు చెందిన షహనాజ్​కు వైద్యులు ఈ రోజు తెల్లవారుజామున శస్త్రచికిత్స చేసి శిశువును కాపాడారు. శస్త్రచికిత్స తర్వాత గుండెపోటుతో ఆమె మరణించింది.

షహనాజ్​ గర్భవతిగా ఉన్న సమయంలో స్వైన్‌ ఫ్లూ సోకింది. అక్కడి వైద్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించాలని సూచించారు.​ వెంటనే బంధువులు ఆమెను గాంధీ ఆస్పత్రిలో చేర్చారు.

క్లిష్టమైన స్థితిలో చేరిన షహనాజ్​ పట్ల గాంధీ వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని... వచ్చిన రోజు ఆమెను మామూలు వార్డులో ఉంచారని మృతురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే షహనాజ్​ మరణించిందని ఆందోలనకు దిగారు.

స్వైన్​ ఫ్లూతో బాలింత మృతి

ఇదీ చూడండి: నేటి నుంచే పట్టణ ప్రగతి... పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపే లక్ష్యం

Last Updated : Feb 24, 2020, 9:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.