కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాల ఎత్తిపోతలు మొదలయ్యాయి. పెద్దపెల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో నిర్మించిన సరస్వతీ పంప్ హౌస్ నుంచి పార్వతి బ్యారేజ్‌లోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. 1,2,5,7 మోట్లర్లు రన్ చేసి పార్వతి బ్యారేజీలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పార్వతీ బ్యారేజ్ ఇన్ ఫ్లో 11,720 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 10,440 క్యూసెక్కులుగా ఉంది. పార్వతీ బ్యారేజ్ పూర్తి సామర్థ్యం8.83 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 5.86 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: మూడు భారీ పంపులతో గోదావరి జలాల ఎత్తిపోత